60 ఏళ్లు దాటిన తర్వాత మతిమరుపు పెరగడం సహజమేనా? కుటుంబ సభ్యుల పేర్లు లేదా బంధుత్వాలను గుర్తుపట్టలేకపోవడం, రోజువారీ పనులు చేయడంలో ఇబ్బంది పడటం వంటి మార్పులు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి సాధారణ మతిమరుపు లక్షణాలా? లేక డిమెన్షియా, అల్జీమర్స్ వంటి సమస్యలకు సంకేతాలా?

ఈ వీడియోలో డాక్టర్ ప్రవీణ్ కుమార్ 60 ఏళ్ల తర్వాత కనిపించే మతిమరుపు, జ్ఞాపకశక్తి తగ్గడం, రోజువారీ పనుల్లో ఎదురయ్యే ఇబ్బందులు, అల్జీమర్స్ మరియు డిమెన్షియాకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను వివరిస్తున్నారు. జ్ఞాపకశక్తిలో మార్పులు కనిపించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వైద్యుల సలహా ఎందుకు అవసరమో కూడా తెలుసుకోవచ్చు.

ఈ వీడియోలో కొన్ని హోమియోపతి మందులు, వైద్య అనుభవాలకు సంబంధించిన విషయాలు కూడా ప్రస్తావించబడ్డాయి. అయితే మతిమరుపు, డిమెన్షియా లేదా అల్జీమర్స్ సమస్యలకు సొంతంగా మందులు వాడకుండా అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. సరైన వైద్య పరీక్షల ద్వారా సమస్యకు కారణాన్ని గుర్తించుకోవాలి.

మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)